నందమూరి-మెగా అభిమానులకి మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఇది...
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మొదలవనున్నచిత్రాన్ని రేపు లాంచనంగా ప్రారంబించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానుండడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రం ఓపెనింగ్ పైన పడింది.
ఇక పవన్ రేపు రావడానికి గల కారణం అందరికి తెలిసినదే. అదే ఆయన దర్శకుడు త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడు అవ్వడం అలాగే వారిరువురి కలయికలో వస్తున్న తాజా చిత్రం కూడా ఇదే నిర్మాణసంస్థలో అవ్వుతుండడం తో ఆయన రేపు హాజారుకానున్నాడు.
ఇదిలావుండగా పవన్-ఎన్టీఆర్ ల మధ్య కూడా ఆరోగ్యకరమైన స్నేహం ఉండడం కూడా వీరిరువురి రేపు ఒకే వేదిక పంచుకోవడానికి ఒక ముఖ్య కారణం.