రెండు మూడు రోజుల నుండి ఎక్కడ విన్న హ్యాకింగ్ & హ్యాకర్స్ గురించిన వార్తలే. అయితే ఇప్పుడు ఆ హ్యాకర్స్ పవన్ ని కూడా టార్గెట్ చేశారు?!
అందుతున్న సమాచారం ప్రకారం, గత కొన్నిరోజులు గా జనసేన అధ్యక్షుడు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసినట్టు తెలుస్తుంది. అయితే జనసేన పార్టీ ప్రస్తుతం ఈ అంశం పై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు.
పూర్తీ వివరాలు తెలిసాక బాధ్యుల పై తగు చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ వర్గాలు తెలియచేశాయి. దీన్ని బట్టి సైబర్ నేరగాలు సెలబ్రిటిల పై కన్నువేసినట్టు అర్ధమవుతుంది.