పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘వకీల్‌సాబ్’ సినిమాపై గందరగోళం కొనసాగుతోంది. ఈ సినిమా తిరిగి సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో ఎవరికీ తెలియడంలేదు. మరోపక్క, కన్‌ఫ్యూజన్ క్లియర్ అయిపోయిందనీ, రేపో మాపో సినిమా తిరిగి షూటింగ్ ప్రారంభించుకోనుందనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఇలా వుంటే, పవన్ ఏమాత్రం షూటింగ్‌కి ఒప్పుకోవడంలేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దానిక్కారణం పవన్ ఆచరిస్తున్న ‘చాతుర్మాస ధీక్ష’ అన్నది కొన్ని ప్రచారాల సారాంశం.
అయితే, పవన్ మాత్రం.. షూటింగ్ సమయంలో కరోనా ఎవరికైనా సోకితే ఎంటి పరిస్థితి.? అన్న కోణంలోనే కొంత ఆచి తూచి వ్యవహరిస్తున్నారట. అంతే తప్ప, చాతుర్మాస దీక్షతో ఈ షూటింగ్‌కి వచ్చిన ఇబ్బందేమీ లేదని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ‘పవన్ ఎప్పుడైనా షూటింగ్‌కి రెడీ. వరుసగా రెండు మూడు సినిమాలు చేయడానికీ ఆయన సిద్ధంగానే వున్నారు..’ ఆని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పవన్ ‘వకీల్‌సాబ్’తోపాటు, క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం విదితమే.
మరోపక్క హరీష్ శంకర్‌తో కూడా సినిమా ఇప్పటికే ప్రకటితమయ్యింది. అయితే, అదింకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. పొలిటికల్ డెవలప్‌మెంట్స్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా తన సినిమాల షూటింగులు కంప్లీట్ చేయాలని కూడా పవన్ అనుకుంటున్నారట.