బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'పింక్' మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రీమేక్ చేయాలని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో కలిసి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా ఈ ప్రాజెక్టుపై ఉత్సాహం చూపిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే, పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఇంతవరకూ ఎదురు చూశారు. పవన్ నుండి ఆ గ్రీన్ సిగ్నల్ రానే వచ్చిందని తాజాగా అందుతోన్న సమాచారం.
డిశంబర్ మూడో వారంలో కానీ, జనవరి మొదటి వారం నుండి కానీ, ఈ సినిమా సెట్స్‌లో పవన్ అడుగుపెట్టనున్నారట. అన్నట్లు ఈ సినిమా ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందని ఫిలిం నగర్ టాక్. ఎలాంటి హడావిడీ లేకుండా, దిల్ రాజు ఆఫీసులోనే సినిమాని కామ్‌గా స్టార్ట్ చేసేశారట. ఇక సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి. ఇదిలా ఉంటే, దిశ అత్యాచార సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో ఈ టైమ్‌లోనే ఈ సినిమాని తెరకెక్కించడం భావ్యమని భావిస్తున్నారట. సో అలా దిశ ఎఫెక్ట్ 'పింక్' రీమేక్‌పై ఉన్నట్లు అర్ధమవుతోంది.