పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇదే చేదు వార్తే అవ్వొచ్చు.
అదేంటంటే, దసరా కానుకగా పవన్-త్రివిక్రమల చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తారని అందరు ఆశించారు. దానికి తగట్టుగానే యూనిట్ కూడా షెడ్యూల్స్ సిద్ధం చేశారు. అయితే పవన్ రాజకీయాల కోసం కొంత సమయం తీసుకుంటున్నాడు, దీనితో షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగడంలేదు.
ఇవ్వన్ని కలిసి ఈ సినిమా రిలీజ్ ని ఒక నెల వెనక్కి నేట్టినట్టు సమాచారం. అయితే, ఇంకా దీనిపై స్పష్టత రావాల్సివుంది. అదే గనుక జరిగితే, పవన్ దసరా బరి నుండి తప్పుకున్నట్టే?!