'బెడ్ రూమ్' అంటే భయపడిపోయిన పాయల్.

మరిన్ని వార్తలు

బోల్డ్ సినిమాకి బూతు సినిమాకి మధ్య సన్నని గీత వుంటది. ఆ సన్నని గీత ఏమిటో.. ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ కి బాగా అర్ధమైపోయింది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాయల్ పేరు మార్మోగిపోయింది. ఇందులో బోలెడంత బోల్డ్ గా కనిపించింది. కట్ చేస్తే 'RDX love' సినిమా చేసింది. ఇందులో కూడా బోలెడంత బోల్డ్ గా కనిపించింది. కానీ బూతు సినిమాల కోవలోకి వెళ్ళింది. జూనియర్ షకీలా అనే కామెంట్లు చేశారు విమర్శకులు. ఈ దెబ్బతో ఆమెకు బూతుకుకి బోల్డ్ కి మధ్య తేడా అర్దమైపోయింది.

 

ఇటివలే ఓ నిర్మాత, దర్శకుడు పాయల్ ని కలసి ఓ కధ చెప్పారు. ''చాలా బోల్డ్ సినిమా మేడమ్. మీరే మెయిన్. మీచుట్టే కధ తిరిగుతుంది'' అని మొదలుపెట్టి.. పదినిమిషాల నేరేషన్ లో ఐదు బెడ్ రూమ్ సీన్లు చెప్పారట. పాయల్ కి డింగుమని జ్ఞానబల్బు వెలిగిపోయింది. 'RDX love' ఇచ్చిన షాక్ నుండి ఇంకా కోలుకోలేదండి. బోల్డ్ సినిమా అని చెప్పి ఓ బూతు సినిమాగా ప్రాజెక్ట్ చేశారు. అది బోల్డ్ సినిమా అని కవర్ చేయలేక చచ్చాను. దయచేసి ఇలాంటి బెడ్ రూమ్ కధలు నా దగ్గరికి ఇంక తీసురాకండి. కేవలం స్కిన్ షోతో నడిచే కధలు ఇంక చేయదలచుకోలేదు'' అని ఖారాకండిగా చెప్పేసిందట పాయల్. మొత్తానికి 'RDX love' పాయల్ పాపకి మంచి పాఠమే నేర్పింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS