సింగర్ 'కల్పనా రాఘవేందర్' మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కల్పన, ప్రభాకర్ దంపతులు హైదరాబాద్ లో నిజాంపేట ఏరియాలో ఉన్న వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లాలో గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం 4:30 కు కల్పన భర్త ప్రభాకర్ నుంచి వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లా సెక్రటరీకి ఫోన్ వచ్చిందని, సీసీ కెమెరాలు చెక్ చేసి, ప్రభాకర్ సెక్రటరీ హెల్ప్ కోసం ఫోన్ చేసారని తెలుస్తోంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పెట్రోలింగ్ పోలీసులు కల్పన ఇంటి డోర్లు పగలగొట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను ప్రైవేటు హాస్పటల్ కి తరలించారు.
నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది కల్పన. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వైద్యులు ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ కేసులో కల్పన భర్త ప్రభాకర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. కల్పన సూసైడ్ అటెంప్ట్ పై ఆమె భర్త ప్రభాకర్ మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రోజులుగా తాను ఇంటిలో లేనని, చెన్నై వెళ్లినట్లు ప్రభాకర్ చెప్తున్నారు. అయితే చెన్నై ఎందుకు వెళ్లారు. నిజంగానే ప్రభాకర్ చెన్నై వెళ్ళారా అని దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు చెప్తున్నారు. కానీ అన్ని బాగుంటే కల్పన ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏంటని అందరిలో సందేహాలు మొదలయ్యాయి.