ప్రముఖ తమిళ నటులైన విజయ్ కుమార్ కుమార్తె నటి అయిన వనిత విజయకుమార్ పై ఆమె రెండో భర్త పోలీసు కేసు పెట్టడం చర్చనీయాంశమైంది.
కేసు వివరాల్లోకి వెళితే, వనిత విజయకుమార్ 2007లో NRI అయిన ఆనంద్ రాజన్ ని రెండవ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప (జెనిత) పుట్టింది. అయితే వీరు ఇరువురు 2012లో కోర్టు సమక్షంలో విడాకులు తీసుకున్నారు, ఆ సమయంలో వారికి పుట్టిన పాప సంరక్షనని తండ్రికే (ఆనంద్ రాజన్) ఇవ్వాలంటూ వనిత కోర్టుని ఆశ్రయించింది.
ఇది జరిగిన 5 సంవత్సరాల తరువాత, తాను ఇంట్లోలేని సమయంలో తన పాపని వనిత విజయకుమార్ వచ్చి ఎత్తుకెళ్ళారని ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి, ఆయన పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చాడు.
అయితే తగిన విధంగా పోలీసులు తనకి సహకరించట్లేదు అని ఒక తెలుగు న్యూస్ ఛానల్ ని ఆశ్రయించాడు. ఆసక్తికరంగా వనితకి అంతకుముందే ఆకాష్ అనే వ్యక్తి తో 2000లో మొదటి వివాహం చేసుకొన్న వనిత, అతనితో విబేధాల కారణంగా 2005లో విడాకులు తీసుకోవడం జరిగింది.