'డిజె దువ్వాడ జగన్నాథమ్' సినిమా టీజర్లోనే పూజా హెగ్దే గ్లామర్ మీద ఓ క్లారిటీ వచ్చేసింది. సినిమా విడుదలయ్యాక సినిమాకే పూజా హెగ్దే గ్లామర్ హైలైట్ అయిపోయింది. అందాల భామ పూజా హెగ్దే తెలుగులో 'ముకుంద', 'ఒక లైలా కోసం' సినిమాల్లో ఇంతకు ముందే నటించింది. అయితే ఆ సినిమాలేవీ గ్లామరస్ కోణంలో ఆమెకు అంత గుర్తింపు ఇవ్వలేదు. అంతలా గ్లామర్ కూడా ఒలకబోసెయ్యలేదు ఆ సినిమాల్లో. 'ముకుంద'లో అయితే మరీ పద్ధతిగా కనిపించింది పూజా హెగ్దే. 'డిజె - దువ్వాడ జగన్నాథమ్' సినిమాకొచ్చేసరికి పూజా హెగ్దే రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పూజా హెగ్దే ప్రదర్శించిన బికినీ గ్లామర్ న భూతో న భవిష్యతి అనేస్తున్నారంతా. అప్పుడెప్పుడో 'బిల్లా' సినిమాలో అనుష్క బికినీతో ఓ ఊపు ఊపేసింది. మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో పూజా హెగ్దే బికినీ గ్లామర్‌తో సత్తా చాటిందని సినీ జనం అంటున్నారు. ఈ మధ్యలో చాలామంది అందాల భామలు బికినీలో మెప్పించేందుకు ప్రయత్నించారుగానీ, పూజా హెగ్దేకి మాత్రమే అంతటి పాపులారిటీ దక్కిందనడం నిస్సందేహమే. 'డిజె' సినిమాకి పాజిటివ్ బజ్ రావడం పట్ల పూజా హెగ్దే ఆనందం వ్యక్తం చేసింది. తెలుగులో తాను చేసిన తొలి అల్ట్రా మోడ్రన్ క్యారెక్టర్ సూపర్ హిట్ అయ్యిందని ఆమె చెప్పేసుకుంటోంది. ఏదేమైనా పూజా హెగ్దే బికినీ గ్లామర్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.