RRR పై పూజా కామెంట్‌!

మరిన్ని వార్తలు

టాలీవుడ్ నే కాదు.. యావ‌త్ భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ చూపునీ త‌న వైపుకు తిప్పుకుంది... ఆర్‌.ఆర్‌.ఆర్‌. జ‌న‌వ‌రి 7న ఈ సినిమా విడుద‌ల అవుతోంది. ఈలోగా ఎన్నో అంచ‌నాలు. 9న ట్రైల‌ర్ వ‌స్తోంది. ఆ ట్రైల‌ర్ వ‌చ్చాక‌... ఆ అంచ‌నాలు మ‌రింత‌గా పెర‌గ‌డం ఖాయం. ఈలోగా... ఆర్‌.ఆర్‌.ఆర్ నుంచి కొత్త లుక్స్ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. సోమ‌వారం రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ కొత్త పోస్ట‌ర్ల‌ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ప‌ల‌క‌లు తిరిగిన దేహంతో.. ఎన్టీఆర్‌, చర‌ణ్‌... లుక్స్ అదిరిపోయాయి. వీరిద్ద‌ర్నీ వెండి తెర‌పై ఎప్పుడు చూస్తామా అంటూ స‌గ‌టు అభిమాని క‌ల‌లు కంటున్నాడు. ఆ అభిమానుల జాబితాలో ఇప్పుడు పూజా హెగ్డే కూడా చేరిపోయింది.

 

ఆర్‌.ఆర్‌.ఆర్ పోస్ట‌ర్లు చూసిన వెంట‌నే పూజా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. రాజ‌మౌళి సార్ సృష్టించే ఈ ఎమోష‌న‌ల్ డ్రైవ్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నా.. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ ఫెంటాస్టిక్ గా క‌నిపిస్తున్నారు. వీరిద్ద‌రి ఫైర్‌ని తెర‌పై చూడ‌డానికి ఆత్రుత‌గా ఉంది`` అంటే.. ట్వీట్ చేసింది పూజా హెగ్డే. అటు చ‌ర‌ణ్ తో (ఆచార్య‌), ఇటు ఎన్టీఆర్ తో (అర‌వింద స‌మేత‌)... ఇద్ద‌రితోనూ క‌థానాయిక‌గా న‌టించింది పూజా. ఆ స్నేహం కొద్దీ త‌న అభిమానాన్ని ఇలా ప్ర‌క‌టించుకుంది. కాక‌పోతే.. రాజ‌మౌళి సినిమాలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌నిచేసే అవ‌కాశం రాలేదు. ఈ ట్వీట్ తో.. జ‌క్క‌న్న కంట్లో ప‌డిపోవ‌డం ఖాయం. మ‌రి త‌దుప‌రి సినిమా కోసం పూజా ని తీసుకునే ప్లాన్ ఏమైనా ఉందేమో..?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS