'అల వైకుంఠపురములో..' సినిమాతో పూజా హెగ్దేకి మంచి పాపులారిటీ దక్కింది. అసలే బోలెడంత క్రేజీ భామ. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో, పూజాని నెత్తిన పెట్టేసుకుంటున్నారు. ఇకపోతే, ఈ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజా హెగ్దేని చాలా చాలా అందంగా చూపించారనే టాక్ కూడా ఉంది. ముఖ్యంగా పాటలు పూజా హెగ్దే చుట్టూనే తిరగడం మరో కీలకమైన అంశం. దాంతో పూజా పేరు తెగ మార్మోగిపోతోంది. 'సామజవరగమనా..' సాంగ్ పిక్చరైజేషన్ కానీ, సాంగ్‌లోని లిరిక్స్ కానీ, కుర్రకారును ఊపేస్తున్నాయి.
ఈ సాంగ్ లిరిక్స్, విజువలైజేషన్ అంతా పూజా హెగ్దే కాళ్లపైనే తిరుగుతుంది. అన్నీ బాగున్నాయి కానీ, పూజా కాళ్ల స్కిన్ టోన్ అంత బాగా లేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాళ్లపై ఫోకస్ పెట్టినప్పుడు సెకండ్ స్కిన్ వేసి కవర్ చేయాల్సిందంటూ సలహాలిస్తున్నారు. ఎందుకంటే, అంత క్లోజప్‌గా కాళ్లను చూపించినప్పుడు వాటి అందం మత్తెక్కించేలా ఉండాలి కదా. కానీ కాస్త ఎబ్బెట్టుగా ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే, పాటను ఫీలవ్వండి కానీ, నా కాళ్లను చూసి ఫీలవ్వకండి.. అంటూ ఈ విషయమై పూజా హెగ్దే రెస్పాండ్ అయింది. అంతేనా.? ప్రమోషన్స్‌లోనూ పూజా తన కాళ్ల ప్రదర్శనకు ఎంత మాత్రమూ తగ్గడం లేదు. సోలో ఇంటర్వ్యూస్, టీమ్ ఇంటర్వ్యూస్‌లో కూడా పూజా తన కాళ్లను విచ్చలవిడిగా ఎక్స్‌పోజ్ చేస్తోంది. 'కొంచెం బీటు మార్చండిరా బాబూ..' అని బన్నీ అన్నట్లుగా 'పూజా కాస్త ఆ కాస్ట్యూమ్ (బోటమ్ లెస్ డ్రస్) మార్చమ్మా.. కాళ్లను కొంత కవర్ చేయమ్మా..' అంటూ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.