తెలుగులో టాప్ హీరోయిన్ల స్థానంలో పూజా హెగ్డే, రష్మిక ఇద్దరూఉంటారు. పారితోషికం, క్రేజ్.. ఈ రెండు విషయాల్లోనూ వీళ్లు పోటా పోటీనే. ఓ విషయంలో రష్మిక కంటే... పూజా హెగ్డేకే ఓటు పడింది. ఈమధ్య తమిళ సూపర్ స్టార్ విజయ్ సినిమాలో హీరోయిన్ కోసం దర్శకుడు, నిర్మాత తెగ వెదికేశారు. చివరికి టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న రష్మిక, పూజా హేగ్డేల పేర్లు పరిశీలించారు.
వీళ్లలో ఎవరికి తీసుకోవాలో తెలీక తిక మక పడుతున్న తరుణంలో.. హీరో విజయ్... పూజా హెగ్డేకి ఓటేశాడట. దాంతో.. పూజాని హీరోయిన్ గా ఖరారు చేసేశారు. ఈ సినిమా కోసం పూజా కి ఏకంగా 3 కోట్ల పారితోషికం ఇవ్వడానికి కూడా రెడీ అయ్యార్ట. పూజాకి తెలుగులో 2.5 కోట్ల వరకూ పారితోషికం ముట్టజెబుతున్నారు. ఆ లెక్కన ఓ అరకోటి ఎక్కువ ఇచ్చి మరీ.. పూజాని హీరోయిన్ గా తీసేసుకున్నారన్నమాట. తమిళంలో కథానాయికలకు మరీ అంత ఎక్కువ పారితోషికాలు ఇవ్వరు. నయనతార లాంటి వాళ్లకే 3 కోట్లు ఇస్తుంటారు. లెక్కన పూజా... నయన ఒక్కటే అన్నమాట.