పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా ఐదు సినిమాలు ప్రకటితమయ్యాయి. వీటిల్లో రెండు ఆల్రెడీ సెట్స్ మీదకు వెళ్ళాయి. ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయిపోయింది కూడా. నిన్ననే కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది.. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం. ఇవన్నీ ఓ ఎత్తు, అసలు పవన్ సినిమాల్లో హీరోయిన్లు ఎవరు.? అన్నది ఇంకో ఎత్తు. ప్రస్తుతానికైతే పవన్ సరసన నటించే హీరోయిన్లపై స్పష్టత లేదు.
అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పూజా హెగ్దే రెండు సినిమాల్లో పవన్ సరసన జతకట్టబోతోందట. ఈ మేరకు ఆయా చిత్రాల దర్శక నిర్మాతలు పూజా హెగ్దేతో డీల్ ఫైనల్ చేసేసుకున్నారని సమాచారం. అయితే, ఏ సినిమాల్లో పవన్ సరసన పూజా హెగ్దే జతకట్టబోతోందన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. కాగా, ఓ సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించబోతోందనీ, ఇంకో సినిమా కోసం బాలీవుడ్ నుంచి ఓ కొత్త భామని ఇంపోర్ట్ చేయబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది.
కరోనా నేపథ్యంలో పవన్ నుంచి సినిమాలు ఆలస్యమవుతున్నాయిగానీ, లేదంటే.. ఈపాటికే ‘వకీల్‌సాబ్’ వచ్చేసి, పాతబడిపోయి వుండేది కూడా. ‘వకీల్ సాబ్’ సంక్రాంతికి కూడా వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. ఒకవేళ సంక్రాంతికి ‘వకీల్‌సాబ్’ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే, ఆ వెంటనే సమ్మర్‌లో పవన్ నుంచి మరో సినిమా విడుదల కావొచ్చు.