కొంతమంది అంతే, చంపేసేందుకే పుడతారు. ఆగండాగండి మీరు డబుల్ మీనింగ్స్ తీయకండి. మేం మాట్లాడుతున్న 'చంపేయడం' మీనింగ్ అందంతో చంపేసేందున్న మాట. జిగేల్ రాణి పూజా హెగ్దే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసి ఇచ్చిన క్యాప్షన్ అండీ బాబూ ఇది. తప్పుగా అర్ధం చేసుకోకండి. చూస్తున్నారుగా.. ఎంత ఘాటు పోజో. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్దే.
అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో', ప్రబాస్‌తో 'జాన్' సినిమాల్లోనూ, యంగ్ హీరో అఖిల్‌తో ఓ సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు, బాలీవుడ్‌లో 'హౌస్ ఫుల్ 4' సినిమాలోనూ నటిస్తోంది. ఇంత బిజీగా ఉన్నా, హాట్ ఫోటో సెషన్‌లోనూ ముందుంటుంది అందాల పూజా హెగ్దే. అలా లేటెస్ట్‌గా ఆమె దిగిన ఫోటోల్లోంచి ఓ ఘాటు అందాల పోజుని నెటిజన్స్ కోసం వదిలింది. డార్క్ బ్లూ డెనిమ్ ప్యాంట్, షర్టు ధరించింది.
పేరుకే ప్యాంట్ షార్ట్ అది. షర్టుకు బటన్స్ వదిలేయడంతో, లోపల ధరించిన బ్రైట్ ఎల్లో కలర్ ఇన్నర్ వేర్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నర్ వేర్ ఒక్కటే కాదు, ఇన్నర్‌లో దాగున్న అందాలు కూడా బట్టబయలైపోతున్నాయి. ఇక కాళ్లకు వేసిన వైట్ కలర్ షూస్, కళ్లకు పెట్టిన స్టైలిష్ గాగుల్స్ టోటల్ ఈ పిక్ స్వరూపాన్నే మార్చేసి, నెటిజన్స్ గుండెల్లో హాట్ హాట్‌గా హీటు పుట్టించేస్తున్నాయ్.