న్యూ నార్మల్’ అంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు. మాస్క్‌లను ధరించడం అలవాటు చేసుకోవాలనీ, సోషల్ డిస్టెన్సింగ్‌ని అలవాటు చేసుకోవాలనీ.. ఇలా రకరకాల విషయాల పట్ల అవగాహన పెంచుతున్నారు. కానీ, అన్ని సందర్భాల్లోనూ అవి సాధ్యమేనా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు విషయానికొస్తే, టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా వున్న పూజా హెగ్దే, కరోనాకి ముందే కొన్ని బాలీవుడ్ సినిమాలకీ కమిట్ అయ్యింది. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్‌తోపాటు, కోలీవుడ్ ప్రాజెక్టులూ పూర్తి చేయడానికి చాలా చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది.
ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా పనుల్లో బిజీగా వున్న పూజా హెగ్దే, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదల కోసం ఎదురుచూస్తోన్న విషయం విదితమే. ఆయా సినిమాల షూటింగుల నిమిత్తం.. విదేశాల్లో ప్రయాణించడం.. దేశంలోనూ వివిధ నగరాల మధ్య చక్కర్లు కొట్టడం తప్పనిసరి. ఇదే విషయాన్ని పూజా హెగ్దే ప్రస్తావిస్తూ, ‘న్యూ నార్మల్ చాలా కష్టంగా వుండబోతోంది.. ఇప్పటికే ఆ అనుభవాల్ని చూస్తున్నాం. కానీ, తప్పదు. ఆయా నిబంధనల్ని పాటిస్తూనే, నగరాల మధ్య చక్కర్లు కొట్టవలసి వస్తోంది. ఎప్పటికప్పుడు కరోనా టెస్టులూ చేయించుకోక తప్పడంలేదు..’ అని చెప్పింది పూజా హెగ్దే. ఇదివరకటి సందడి సెట్స్‌లో కనిపించడంలేదనీ, ఇది కొంత ఇబ్బందికరంగా మారిందనీ అభిప్రాయపడింది. ‘న్యూ నార్మల్‌కి అలవాటు పడటం కష్టంగానే వుంది.. కానీ, ఫైనల్ ఔట్‌పుట్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..’ అని చెప్పింది పూజా హెగ్దే.