హీరోయిన్ల పనే బాగుంది. ఒకేసారి రెండు మూడు సినిమాల్ని చేసేసుకోవొచ్చు. పనిలో పనిగా ఐటెమ్ గీతాలూ ఒప్పేసుకోవొచ్చు. రెండు మూడు భాషల్ని చుట్టి రావొచ్చు. వాళ్లకున్న డిమాండ్ ఎవ్వరికీ లేదు. క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడంలోనూ వాళ్ల తరవాతే ఎవరైనా. ఇప్పుడు పూజా హెగ్డే అదే చేస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ తనే. ఇప్పుడు పక్క రాష్ట్రాల వంకా చూస్తోంది.
తాజాగా.. `ఆచార్య`లో రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో పూజా పాత్ర కీలకమే అయినా, నిడివి చాలా తక్కువ. కేవలం 20 నిమిషాలు ఉండే పాత్రట. కానీ.. ఛార్జీలు మాత్రం ఫుల్ గా వేసేసింది. ఈ సినిమాకి గానూ తాను కోటి రూపాయల పారితోషికం అందుబోతున్నట్టు టాక్. ఇంతా చేస్తే... 10 రోజుల కాల్షీట్టే ఇచ్చిందట. అంటే.. రోజుకి పది లక్షలన్నమాట. పూజా కంటే ముందు ఈ పాత్ర కోసం రష్మిక ని సంప్రదించారు. కానీ రష్మిక ఫుల్ బిజీగా ఉండడంతో.. పూజా దగ్గరకు ఈ ఆఫర్ వెళ్లింది.