పూజా హీరోయినా? అతిథిగానా..?

By Gowthami - September 16, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

'వాల్మీకి'లో పూజా హెగ్డే పాత్ర ఏమిట‌న్న విష‌యంలో కాస్త గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ అనే ప్రచారం జ‌రిగింది. అయితే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో మాత్రం పూజా పోషించిన శ్రీ‌దేవి పాత్ర‌ హీరోయిన్‌కి త‌క్కువ‌, అతిథి పాత్ర‌కు ఎక్కువగా ఉంటుంద‌న్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఈ సినిమాలో పూజా స్క్రీన్ టైమింగ్ చాలా త‌క్కువ‌ని, అయినా స‌రే.. ఈ సినిమాలో న‌టించ‌డానికి పూజా ఒప్పుకుంద‌ని చెప్పేశాడు హ‌రీష్ శంక‌ర్‌. ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే కొన్ని స‌న్నివేశాల‌కు, ఓ పాట‌కు మాత్ర‌మే పూజా ప‌రిమితం కానుంది.

 

అంటే దాదాపుగా పూజాది గెస్ట్ అప్పీరియ‌న్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మృణాళిని అనే కొత్త‌మ్మాయి క‌థానాయిగా న‌టించింది. డింపుల్ ఓ ప్ర‌త్యేక గీతానికి ప‌రిమిత‌మైంది. అంటే 'వాల్మీకి'లో ముగ్గురు హీరోయిన్లు క‌నిపిస్తార‌న్న‌మాట‌. ఇందులో స్టార్ కేట‌రిగీలో క‌నిపించే నాయిక పూజా కాబ‌ట్టి- ఆమెనే ప్ర‌ధాన క‌థానాయిక‌గా చలామ‌ణీ అవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS