అందుకే పూజా హెగ్దే సమ్‌థింగ్‌ స్పెషల్‌

మరిన్ని వార్తలు

తొలి సినిమా 'ముకుందా' నుండే సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించుకున్న పూజా హెగ్దే ఇప్పుడు సరికొత్త అభిమానాన్ని సంపాదించుకుంటోంది. ఆమె నడత, నడక అన్నీ అభిమానుల్ని కట్టి పడేస్తున్నాయి. సక్సెస్‌ ఉంటేనే హీరోయిన్స్‌కి హవా అనే మాట మొన్నటి మాట. కానీ ఇప్పుడలా లేదు. ఆటిట్యూడ్‌తో హీరోయిన్స్‌ మార్కులు కొట్టేస్తున్నారు. అలా ఆటిట్యూడ్‌ ప్రదర్శించే వాళ్లలో ఈ జనరేషన్‌ హీరోయిన్స్‌లో పూజా హెగ్దే పేరు మొదటి వరుసలో పేర్కొనాలి. ప్రజెంట్‌ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న పూజాహెగ్దే. లేటెస్ట్‌గా 'అల వైకుంఠపురములో..' సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు పేర్కొంది పూజా హెగ్దే. లేడీ బాస్‌గా పూజా హెగ్దే పాత్రకు ఈ సినిమాలో విజిల్స్‌ పడుతున్నాయి. పాత్రల ఎంపికలో సినిమా సినిమాకీ పరిణీతి చూపిస్తోన్న పూజాహెగ్దే, 'అరవింద సమేత..' సినిమా నుండి తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటోంది. డబ్బింగ్‌ చెప్పడం వల్ల పాత్ర ఓవరాక్షన్‌ చేసినట్లవుతుందనీ, అదే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటే, పాత్ర పరిమితుల మేరకు వ్యవహరిస్తుందనీ, అందుకే ఇకపై కూడా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటున్నానని పూజా హెగ్దే చెబుతోంది. అంతేకాదు, ఒకేసారి ఐదారు సినిమాల్లో నటించగల స్టామినా తనకుందని పూజా కాన్ఫిడెంట్‌గా చెబుతోంది.

 

రోజులో ఎన్ని షిఫ్టుల్లో అయినా వర్క్‌ చేసేలా తన మైండ్‌ సెట్‌ని డిజైన్‌ చేసుకున్నాననీ, అలా ఎప్పుడూ వర్క్‌ చేస్తుంటేనే మైండ్‌ మరింత బాగా వర్క్‌ చేస్తుందంటూ తన పర్సనల్‌ విషయాలు సరదాగా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది పూజా హెగ్దే. ఇంత స్మార్ట్‌ కాబట్టే, అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ పూజాని అంతగా పొగిడేస్తున్నారు. నిజమే పూజా సమ్‌థింగ్‌ స్పెషల్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS