దేవర లో బుట్టబొమ్మ?

మరిన్ని వార్తలు

ప్రస్తుతం బుట్ట బొమ్మ పూజ హెగ్డే పరిస్థితి ఏం బాలేదు. కెరియర్ మొదట్లో ఎలా ఒడిదుడుకులు ఎదుర్కొందో ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. మొన్నటి వరకు ఆమె వెంట పడిన స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్స్ ఇప్పుడు పూజని అస్సలు పట్టించుకోవటం లేదు. ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. అవకాశాలు రావటం లేదు, కొన్ని చేతివరకు వచ్చి తప్పిపోతున్నాయి.టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ లాంటి ఇండస్ట్రీ లేవి కూడా పూజకి అవకాశాలు ఇవ్వటం లేదు. ఆఖరికి మాతృ భాష అయిన కన్నడలో కూడా పూజని తీసుకోవటం లేదు. ఈ మధ్యే ఒక క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ వచ్చి మళ్ళీ మిస్ అయ్యిందని సమాచారం. పూజకి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ని ఒకప్పుడు తక్కువచేసి బాలీవుడ్ కి పరుగులు పెట్టి రెండిటికి చెడింది. ఇప్పుడు తెలుగు సినిమా అవకాశాలకోసం పడిగాపులు కాస్తూ ప్రత్యేక గీతాలకి కూడా ఓకే చెప్తోంది.  


యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీలో ఒక  ఐటమ్ సాంగ్ ఉందని , దానికోసం పూజ హెగ్డే ని సంప్రదించగా ఓకే చెప్పిందని టాక్. పానిండియా సినిమాగా తెరకెక్కుతున్న దేవర లో పూజ ప్రత్యేక గీతంలో నటిస్తే ఎంతోకొంత గుర్తింపు లభిస్తుంది. పూజా కి ఇదేం కొత్త కాదు. ఇది వరకే  రామ్ చరణ్ తో కలిసి రంగస్థలం మూవీలో ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించింది.  ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ ని ఆకట్టుకునే పనిలో ఉందట పూజా.  


అల వైకుంఠ పురం, అరవింద సమేత లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పూజా ఇలా స్పెషల్ సాంగ్స్ కే పరిమితం అవటం ఆమె స్వయం కృతమే అంటున్నారు సినీక్రిటిక్స్. దేవర సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.  ఫుల్ ఫామ్ లో ఉన్న అనిరుద్ కంపోజిషన్ లో సాంగ్ తో పూజా టాలీవుడ్ కి కమ్ బ్యాక్ ఇస్తుందేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS