పూజా హెగ్డే.. టాలీవుడ్ ని అగ్ర కథానాయికల జాబితాలో ఉండే పేరు. మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించేసింది. ఇంకా అలాంటి అవకాశాలే పూజాకు ఎక్కువగా వస్తున్నాయి. ఎప్పుడైతే స్టార్ హీరోల సినిమాల రుచి మరిగిందో, మీడియం సైజు హీరోల్ని పూర్తిగా మర్చిపోయింది. ఈమధ్య నితిన్ సినిమా కోసం పూజాని సంప్రదిస్తే.. `నో` చెప్పిందట.పూజా దృష్టి కేవలం స్టార్ హీరోలపైనే ఉందని, ఒక్క మెట్టు దిగడానికి కూడా పూజా ఒప్పుకోవడం లేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
పూజా కెరీర్ ప్రారంభంలో యువ హీరోలతోనే ఎక్కువగా నటించింది. వరుణ్‌తేజ్, బెల్లంకొండ లతో సినిమాలు చేసింది. మళ్లీ ఆ హీరోల కోసం పూజా కాల్షీట్లు అడుగుతున్నా... ఇవ్వడం లేదు. కథానాయికల కెరీర్ గ్రాఫ్ చాలా తక్కువ. ఎవరి ఫామ్ అయినా రెండేళ్లకు మించి ఉండదు. ఈలోగా వీలైనన్ని సినిమాలు చేసేయాలి. స్టార్ హీరోలతోనే.. అని పంతం చూపిస్తే కుదరదు. కానీ.. పూజా మాత్రం విచిత్రంగా ప్రవర్తిస్తోంది. స్టార్ హీరోలంతా పూజాతో చేసేస్తే.. అప్పుడు వాళ్లంతా ఫ్రెష్ జోడీ వేటలో పడతారు. అప్పుడు పూజా యువ హీరోలతోనే సినిమాలు చేయాలి. అప్పుడు మాత్రం నాని, నితిన్ లాంటి వాళ్లు పూజాతో చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారు? ఈ విషయంలో పూజా కాస్త ఆలోచిస్తే మంచిదేమో..?