స్టన్నింగ్‌ రోల్‌లో 'గరుడవేగ' బ్యూటీ.!

మరిన్ని వార్తలు

'గరుడవేగ' సినిమాలో రాజశేఖర్‌ భార్యగా నటించిన ముద్దుగుమ్మ పూజా కుమార్‌ గుర్తుంది కదా. సెలెక్టివ్‌గా సినిమాల్ని ఎంచుకుంటూ, ఎంచుకున్న పాత్రలతో మంచి పేరు తెచ్చుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. గతంలో 'విశ్వరూపం', విశ్వరూపం 2' సినిమాల్లో నటించింది. చేసినవి తక్కువ సినిమాలే అయినా, స్క్రీన్‌పై హుందాగా కనిపించడానికే ఇష్టపడుతుంది ఈ బ్యూటీ. వాస్తవానికి పలు ఆంగ్ల సినిమాల్లో గ్లామర్‌ పాత్రలతోనూ మెప్పించింది. సోషల్‌ మీడియాలో అమ్మడి గ్లామర్‌ విశ్వరూపానికి బోలెడంత క్రేజ్‌ ఉంది కూడా. కానీ, సౌత్‌ స్క్రీన్‌పై మాత్రం ఎక్కువగా హోమ్లీ క్యారెక్టర్స్‌లోనే కనిపించింది. ఇప్పుడు ఈ బ్యూటీ ఖాతాలో మరో సినిమా వచ్చి చేరింది.

 

ప్రముఖ నటుడు సత్యరాజ్‌ తనయుడు శిబిరాజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో పూజా వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ రోల్‌ పోషిస్తోంది. ఈ సినిమాలో ఓ సర్‌ప్రైజింగ్‌ రోల్‌లో పూజా కుమార్‌ నటిస్తోంది. ఇంతవరకూ ఎప్పుడూ పోషించని కొత్త పాత్రట అది. వివరాలు పూర్తిగా తెలియవు, కానీ, ఖచ్చితంగా ప్రశంసలు అందుకుంటానని చెబుతోంది. నవంబర్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఈ సినిమాలో శిబిరాజ్‌కి జోడీగా నందితా శ్వేత నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS