'మాయాజాలం' సినిమాలో శ్రీకాంత్‌కి జంటగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా. 'ఒక విచిత్రం' సినిమాలోనూ నటించింది. 'శౌర్యం' సినిమాలో హీరో గోపీచంద్‌కి చెల్లెలిగా, హీరోయిన్ అనుష్కకి ఫ్రెండ్‌గా నటించిన భామ పూనమ్ కౌర్. అందంలో చందమామ. యాక్టింగ్‌లోనూ సూపరే. అయితే టైం కలిసి రాలేదు. హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించుకోవలేకపోయింది. చిన్న చిన్న సినిమాలకే పరిమితమైపోయింది. అయితే ఇప్పుడు ఈ భామకి టైం చంద్రబాబు రూపంలో కలిసొచ్చిందనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూనమ్ కౌర్‌ని ఆంధ్రప్రదేశ్ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ గౌరవం చాలా అరుదైనది. ఇంతటి అరుదైన గౌరవం దక్కించుకున్న పూనమ్ కౌర్‌ని అదృష్టం కాక మరింకేంటి. తెలంగాణాలో ఈ ప్లేస్ ముద్దుగుమ్మ సమంతకి దక్కింది. అయితే సమంత పాపులర్ హీరోయిన్. సోషల్ సర్వీస్‌లోనూ ముందుంటుంది. సో తెలంగాణా చేనేతకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె ఎంపిక పర్‌ఫెక్ట్. ఆ గౌరవం దక్కించుకున్నందుకు సమంత అందుకు తగ్గట్లుగానే కష్టపడుతోంది కూడా. చేనేతా కార్మికుల దగ్గరకు వెళ్లి స్వయంగా వారి కష్టాల్లోకి తొంగి చూసి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. స్టార్ హీరోయిన్‌గా బిజీగా ఉన్పప్పటికీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ అనేది ఓ బాధ్యతగా సమంత నిర్వర్తిస్తోంది. కానీ సమంతలా పూనమ్ ఎంతవరకూ తన బాధ్యతను నిర్వర్తించగలదు.సోషల్ యాక్టివిటీస్‌లో పూనమ్ యాక్టివ్‌గా పాల్గొనలేదు ఇంతవరకూ. హీరోయిన్‌గానూ పాపులారిటీ కాదు. సో సమంతలా పూనమ్ ఎంతవరకూ చేనేత కార్మికులతో ఇంటరాక్ట్ అవ్వగలదు. వారి సమస్యలను ఎలా తెలుసుకోగలదు. ఏమో చూడాలిక.