గత కొన్ని నెలలుగా సాగుతున్న కత్తి మహేష్ - పవన్ అభిమానుల వివాదంలో జనవరి మొదటివారంలో అనూహ్యంగా వచ్చిన పేరు పూనమ్ కౌర్. ఈ అంశంలో పవన్ కళ్యాణ్ అభిమానులని సమర్ధిస్తూ అలాగే కత్తి మహేష్ ని విమర్శిస్తూ పెట్టిన ట్వీట్స్ తో ఆమె ప్రధాన సన్నివేశంలోకి వచ్చింది.
దీనికి కత్తి మహేష్ ఆమెకి ఒక 6 ప్రశ్నలు సంధించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదే సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ ని స్వయంగా కలిసి ఈ అంశంలో తనకి సహాయం చేయమని కోరుతాను అని ట్వీట్ చేయడం ఆ వెంటనే వాటిని డిలీట్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమె పైన పడింది.
ఇక ఈ అంశం పైన గత కొన్నిరోజులుగా మౌనం వహించిన ఆమె నిన్న రాత్రి కత్తి మహేష్ ని ఉద్దేశించి పెట్టిన ట్వీట్ ఇప్పుడు మళ్ళీ ఈ వివాదాన్ని మరింత పెంచినట్టయింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటో మీరే చూడండి -
ఆర్జీవీ తీసిన God, Sex & Truth వీడియోకి మహేష్ మద్దతు తెలపడమే ఈమె ట్వీట్ కి కారణం అని అర్ధమవుతున్నది. మరి దీని పైన మహేష్ కత్తి ఏమైనా స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.