పూనమ్ పాండే పెళ్ళి గోల మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. కరోనా సమయంలో అకస్మాత్తుగా తన పెళ్ళి విషయాన్ని ప్రకటించేసింది పూనమ్ పాండే. బాయ్‌ఫ్రెండ్ సామ్ బాంబేతో గత కొంతకాలంగా ఆమె డేటింగ్‌లో వున్న విషయం విదితమే. డేటింగ్‌ని పెళ్ళిదాకా తీసుకురావడం వెనుక పెద్ద పబ్లిసిటీ స్టంటే నడిచిందని అందరికీ అర్థమవడానికి పెద్దగా సమయం పట్టలేదు. హనీమూన్‌కి వెళుతున్నట్లు ప్రకటించి, హనీమూన్ విశేషాల్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన పూనమ్, కొంత హాట్ కంటెంట్‌ని కూడా అభిమానుల కోసం వదిలింది.
ఇంతలోనే, తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పూనమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. అంతే, పోలీసులు రంగంలోకి దిగి సామ్ బాంబేని అరెస్ట్ చేసేశారు. అసలు ఏం జరిగింది.? అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి వుంది. హనీమూన్ సందర్భంగా ‘రొమాంటిక్ విషయాల్ని’ గొప్పగా చెప్పుకున్న పూనమ్, తన భర్త తనను లైంగికంగా వేధించాడని చెప్పడమేంటట.? ఇదే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతోంది. పూనమ్ ఏదైనా చేయగలదు.. ఆ విషయం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్న ఫొటోలు, వీడియోల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏం చేసినా, అందులో పబ్లిసిటీ కక్కుర్తి కనిపిస్తుంటుంది.
పూనమ్ భర్త అరెస్టు కూడా పబ్లిసిటీ కోసమేనా.? అంటే, అవుననే అభిప్రాయం అందరిలోనూ కలుగుతోంది. ‘భార్యాభర్తలయినాసరే.. భార్యకీ కొన్ని హక్కులుంటాయి శృంగారపరంగా. ఆమెకు ఇష్టం లేకుండా లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకుంటే అది లైంగిక దాడి అవుతుంది’ అంటూ పూనమ్ పాండేకి మద్దతుగా కొందరు నినదిస్తుండడం గమనార్హం. బహుశా ఆమె ఆశించింది కూడా ఇదేనేమో.