లేడీ గబ్బర్‌సింగ్‌ 'ఫసక్‌' గ్లామర్‌

మరిన్ని వార్తలు

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు ఓ ఇంటర్వ్యూలో 'ఫసక్‌' అనే పదాన్ని వాడటం, అదిప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓ ట్రెండీ హ్యాష్‌ ట్యాగ్‌గా మారిపోవడం తెలిసిన సంగతే. 'ఫసక్‌' అంటే ఏంటీ? అనడక్కూడదు. దానర్థం గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతున్నారు. ఇదిగో ఈ ఫొటో చూస్తే ఎవరికైనా 'ఫసక్‌' గ్లామర్‌ అనిపించాల్సిందే. పరిచయం అక్కర్లేదీ భామ గురించి త్వరలో తెలుగులో 'లేడీ గబ్బర్‌సింగ్‌' అనే సినిమా చేయబోతోంది. సోషల్‌ మీడియా సెన్సేషన్‌ అయిన మోడల్‌ పూనమ్‌ పాండే, ఇలాంటి ఫొటోలతోనే సోషల్‌ మీడియా ద్వారా కుర్రాళ్ళకు హాటెస్ట్‌ 'కిక్‌' ఇచ్చేస్తుంటుంది. గ్లామరొక్కటే కాదు, తన టాలెంట్‌ కూడా చూపిస్తానంటూ 'లేడీ గబ్బర్‌సింగ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించేయబోతోంది ఈ అందాల భామ. పూనమ్‌ పాండే నటించిందంటే, అందులో నటన కంటే, ఇదిగో ఇలాంటి అందాల విందు చాలా ఎక్కువగా ఉంటుందన్నదాంట్లో ఎవరికైనా సందేహాలున్నాయా? సందేహాలు అనవసరం. గెట్‌ రెడీ ఫర్‌ పూనమ్‌ ఫసక్‌ గ్లామరస్‌ ట్రీట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS