'నాకు ప్రాణహాని వుంది..' అని ఆమధ్య పవన్ కల్యాణ్ స్టేట్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షనేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు మరోసారి ప్రాధాన్యత చేకూరింది. జగన్‌లా.. పవన్‌పైనా ఇలాంటి దాడులు జరగొచ్చేమో అని పవన్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఈనేపథ్యంలో పవన్‌కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలనికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లకు పోసాని మద్దతు తెలపడం అటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి కలిగిస్తోంది.
పవన్ ఇండియా స్థాయిలో అతి పెద్ద స్టార్ అని, కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చి సినిమాలు తీయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారని, అవన్నీ వదులుకుని ప్రజాసేవకోసం పవన్ వచ్చాడని, అతని మాటల్లో నిజాయతీ ఉంటుందని పోసాని గుర్తు చేస్తూ. అలాంటి వ్యక్తి `నాకు ప్రాణ హాని ఉంది` అని చెబితే... ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచిత్రమన్నారు. అంతేకాదు... పవన్‌కి జెడ్ కేటరిగీ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు పోసాని.
అన్నట్టు పోసానిది వైకాపా పార్టీ అనే సంగతి తెలిసిందే. జనసేనకూ, వైకాపాకూ సిద్దాంతపరమైన బేధాలున్నాయి. పైగా జగన్ అవినితిని పవన్ చాలాసార్లు బహిరంగ వేదికలపై ఎండగట్టాడు. జగన్ కూడా ముగ్గురు భార్యల గురించి ప్రస్తావించాడు. అయినా సరే.. పవన్ ని ఈ విషయంలో పోసాని వెనకేసుకురావడం ఆశ్చర్యాన్ని, రాజకీయ పరంగా కొత్త ఆలోచనల్నీ రేకెత్తిస్తోంది.