యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సాహో తరువాత అదే బ్యానర్.. యూవీ క్రియేషన్స్ తో తన తదుపరి చిత్రం స్టార్ట్ చేసాడు. ఈ బ్యానర్ లో ఏ ముహూర్తాన కమిట్ అయ్యాడో కానీ, అప్ డేట్స్ విషయం లో.. ప్రభాస్ తన అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. సాహో అప్ డేట్స్ విషయం లో కూడా ఇంతే జరిగింది. దాంతో అభిమానులు ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు రిపీట్ చేస్తుంది 'యూవీ క్రియేషన్స్' సంస్థ. ప్రభాస్ తాజా చిత్రం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో వస్తుందని తెలుసు. కానీ హీరోయిన్ ఎవరనేది చివరికి 'పూజా హెగ్డే' కన్ఫార్మ్ చేసే వరకు తెలియలేదు.
ఇకపోతే టెక్నిషియన్ల విషయం లో కూడా ఇదే సస్పెన్స్ నడుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం అందించేది ఎవరనేది ఇంతవరకు తెలియలేదు. సాహో విషయం లో కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది చెప్పలేదు. చివర్లో గిబ్రాన్ ని పెట్టి కానిచ్ఛేసారు. కానీ ఈ చిత్రం అలా కాదు, ఇదో ప్రేమ కథ అని.. ముందు నుండే తెలుసు కాబట్టి, ట్యూన్స్ అంత ఈజీ గా ఓకే కావు. బ్యాక్ గ్రౌండ్ మరియు థీమ్ మ్యూజిక్ కూడా లవ్ స్టోరీ కి చాలా ముఖ్యం.. మరి అలాంటి మ్యూజిక్ కు సంబంధించి అప్ డేట్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.