పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన ప్రబాస్‌

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమాతో యూనివర్సల్‌ స్టార్‌ అనిపించేసుకున్నాడు ప్రబాస్‌. దాదాపుగా ఐదేళ్ల పాటు ఒకే సినిమాకి పరిమితమైపోయి, ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్‌ చేసిన ఆరడుగుల అందగాడు ప్రబాస్‌కి పడిన కష్టానికి ఫలితం దక్కినందుకు ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయ్యారు. అయితే ఫ్యాన్స్‌ కోరిక ఒక్కటే. తమ అభిమాన హీరో ఎప్పుడు ఓ ఇంటి వాడయ్యేదా? అని. ఎప్పటికప్పుడే పెళ్లి మాట మెల్లగా దాటేస్తూ వచ్చేశాడు ప్రబాస్‌. తన తోటి హీరోలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. అంత కన్నా చిన్నవాళ్లు కూడా పెళ్లిళ్లు చేసుకుని, ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూనే, కెరీర్‌లోనూ జోరుగా దూసుకెళ్తున్నారు. మరి ప్రబాస్‌ మాత్రం ఎందుకు పెళ్లికి దూరంగా ఉంటున్నాడు అనేదే ప్రశ్న. అయితే ఈ ప్రశ్నల్లోంచే అనేక గాసిప్స్‌ గుసగుసలాడుతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత పెళ్లి కబురు చెబుతానన్నాడు ప్రబాస్‌. ఆ సినిమా వచ్చి చాలా కాలమే అవుతోంది కానీ ప్రబాస్‌ పెళ్లి మాట మాత్రం వినిపించడం లేదు. అనుష్క - ప్రబాస్‌ది బెస్ట్‌ పెయిర్‌. ఈ ఇద్దరూ కలిసి 'బిల్లా', మిర్చి', 'బాహుబలి' సినిమాల్లో నటించారు. ఈ కారణంగా వీరిద్దరి మధ్యా స్నేహ బంధం ఉంటే ఉండొచ్చు గాక. కానీ ఇదే అదనుగా ఈ ఇద్దరూ రీల్‌ లైఫ్‌ జంట నుండి రియల్‌ లైఫ్‌ జంటగా మారిపోనున్నారంటూ రియల్‌ గాసిప్స్‌ తెగ చక్కర్లు కొడుతున్నాయి. అవును స్వీటీ కూడా పెళ్లి కబురు చెప్పడం లేదు. 'బాహుబలి' తర్వాతనే తన పెళ్లి బురు కూడా చెబుతానంది అనుష్క. కానీ ఇంతవరకూ లేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంపై ప్రబాస్‌ స్పందించారు. క్లారిటీ ఇచ్చేశారు. పెళ్లి అనేది పూర్తిగా నా పర్సనల్‌. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న గాసిప్స్‌ ఏమీ నిజం కావని తేల్చేశారు. ప్రస్తుతం 'సాహో' సినిమాతో బిజీ అయిపోయాడు ప్రబాస్‌ మళ్లీ. మరి పెళ్లెప్పుడంటే మళ్లీ మొదటికెళ్లాల్సిందే.. అదీ సంగతి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS