మన హీరోలు వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ హీరోలే. అందరి మనసుల్నీ గెలుచుకునే ముచ్చటైన పనులు చేస్తుంటారు. ప్రభాస్ అదే చేశాడు. ప్రభాస్ సినిమా అంటే సెట్లో వాళ్లకు పండగే. ప్రతీరోజూ.. ఇంటి నుంచి రుచి కరమైన వంటల్ని తెప్పించి, అందరికీ ప్రేమగా వడ్డిస్తుంటాడు. చిత్రబృందానికి ఖరీదైన కానుకలు ఇచ్చిన ఆశ్చర్యపరుస్తుంటాడు. మరోసారి.. ప్రభాస్ తన టీమ్‌ని ఇలానే సర్‌ప్రైజ్ చేశాడు.
తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌కు రిస్ట్ వాచెస్ గిఫ్ట్‌గా ఇచ్చారు ప్రభాస్. ఈ సినమాకి పనిచేసిన అందరికీ ఈ రిస్ట్ వాచ్ గిఫ్ట్ గా వెళ్లింది. యూరప్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఖరీదైన వాచ్‌లివి. ఈ వేసవిలోనే రాధేశ్యామ్ విడుదల కానుంది. ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నాడు.