కల్కి సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అన్ని భాషల్లోనూ పాజిటీవ్ టాక్ తో కలక్షన్ల వసూళ్లు కురిపిస్తోంది. ఈ సినిమాతో డార్లింగ్ రేంజ్ ఏంటో ఇంకొకసారి రివీల్ అయ్యింది. రాజమౌళి లాంటి క్రియేటీవ్ డైరెక్టర్ కూడా నాగ అశ్విన్ పై ప్రశంసలు కురిపించాడు. కల్కి లో విజువల్స్, యాక్షన్ సీన్స్, చూసి ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. కలియుగాంతానికి, మహాభారతానికి నాగ అశ్విన్ పెట్టిన లింక్ జనాలకి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే అద్భుత మైన కలక్షన్స్ తో దూసుకుపోతోంది.
కలక్షన్స్ గూర్చి నిర్మాత స్వప్నా దత్ మాట్లాడుతూ 'రికార్డ్ ల కోసం సినిమా తీయలేదని, కేవలం సినిమా పై ప్రేమతో తీశామని, అన్న మాటలతో వారికి సినిమా అంటే ఉన్న ప్రేమ వ్యక్తం అవుతోంది. కానీ ప్రభాస్ ఫాన్స్ కోరిక మేరకు టీమ్ కల్కి అఫీషియల్ లెక్కల్ని అనౌన్స్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 191.5 కోట్లు కలెక్ట్ చేసిందని టీమ్ ప్రకటించింది . బాక్సాఫీస్ లెక్కల ప్రకారం తెలుగులో 70 కోట్లు, హిందీలో 25 కోట్లు, మిగిలిన భాషల్లో10 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. భారత్‌లో కల్కి సినిమా దాదాపు 1O5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం.
దీనితో తెలుగులో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కల్కి మూడో ప్లేస్ లో ఉంది. మొదటి ప్లేస్ లో RRR 223 కోట్లు వసూల్ చేసింది. 217 కోట్లతో బాహుబలి 2, రెండో స్థానంలో ఉంది. కల్కి సుమారు ఓవర్సీస్ తో కలిపి 191 కోట్ల గ్రాస్ కలక్ట్ చేసింది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ లో RRR, బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేసిన కల్కి ఫస్ట్ డే వసూళ్లలో కూడా ఈ రికార్డ్ ని దాటేస్తుంది అనుకున్నారు కానీ జస్ట్ మిస్ అయ్యింది అంటున్నారు ప్రభాస్ ఫాన్స్.