కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదా?

మరిన్ని వార్తలు

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కెరియర్ యమా స్పీడ్ గా ఉంది. చేతిలో అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే. రీసెంట్ గా సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి నెక్స్ట్ కల్కి మూవీ తో సందడి చేయనున్నాడు. ఇవి కాకుండా మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలో ఒక కీలక రోల్ లో నటిస్తున్నాడు. కన్నప్ప మూవీ కూడా పాన్ ఇండియా  రేంజ్ లో  తెరకెక్కుతోంది. ఇప్పటికే అన్ని భాషలకి చెందిన నటీ నటులు ఇందులో భాగమయ్యారు. అయితే మొదటి నుంచి కన్నప్పలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడని వార్తలు వినిపించాయి. విష్ణు కూడా ప్రభాస్ శివుడి క్యారక్టర్ లో కనిపించనున్నట్లు అనౌన్స్ చేశారు. నయన తార పార్వతిగా నటిస్తుంది అని కూడా వినిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.             


శివుడి పాత్ర‌లో  అక్ష‌య్ కుమార్ క‌నిపించ‌నున్నట్లు, అనుష్క పార్వతిగా నటించటానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అక్షయ్ శివుడు అయితే మరి ప్రభాస్ ఎలాంటి పాత్ర చేయనున్నాడని, ఆసక్తి మొదలయింది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీలో ప్ర‌భాస్ నందీశ్వ‌రుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని ఫిల్మ్ వర్గాల టాక్.  శివుడి పాత్ర చేయాల‌ని మంచు విష్ణు ఒత్తిడి చేసినా, ఆ భారం మోయలేనని ప్ర‌భాస్ సున్నితంగా ఆ ఆఫ‌ర్ తిర‌స్క‌రించాడ‌ని, తెలుస్తోంది. ఇంత బిజి షెడ్యూల్లో కూడా ప్రభాస్ కన్నప్ప కోసం వారం రోజులు పాటు డేట్స్ అడ్జస్ట్ చేసినట్టు సమాచారం. అంతే కాదు ఎలాంటి రెమ్యునరేషన్  తీసుకోకుండా ఫ్రీ గా ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు టాక్.     


కన్నప్పలో ఇప్పటికే  భారీ క్యాస్టింగ్ ఉండగా, ఇంకా కొత్త వారు యాడ్ అవుతూనే ఉన్నారు. రీసెంట్ గా ఆది పినిశెట్టి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడటానికి ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS