అనుష్క కొన్నాళ్లుగా సినిమాలకి దూరంగా ఉంది. అనుష్క మెయిన్ లీడ్ లో నటించిన 'నిశ్శబ్దం' మూవీ పై చాలా ఆశలు పెట్టుకోగా ఈ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిది. చాలా గ్యాప్ తర్వాత నవీన్ పోలి శెట్టితో మిస్ శెట్టి, 'మిస్టర్ పోలిశెట్టి' మూవీ చేసింది. ఈ మూవీతో అనుష్క మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం మలయాళంలో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తోంది. తెలుగులో క్రిష్ డైరక్షన్ లో 'ఘాటీ' సినిమా చేస్తోంది. వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అనుష్క ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసారని తెలుస్తోంది.
ఏప్రిల్ 18 న థియేటర్స్ లో అనుష్క 'ఘాటీ' గా దుమ్ము రేపటానికి రెడీ అవుతోంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్స్ లేవు. పెద్దగా బజ్ ఏర్పడలేదు. కారణం ఒకటి అనుష్క ప్రజంట్ ఫామ్ లో లేకపోవటం, రెండు క్రిష్ కానీ మేకర్స్ కానీ సరైన అప్డేట్స్ ఇవ్వకపోవటం. ఘాటీ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇది ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ. ఈ క్రమంలో 'ఘాటీ' ప్రచార బాధ్యతల్ని ప్రభాస్ నెత్తి మీద వేసుకోనున్నాడని తెలుస్తోంది. అనుష్క సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండదు. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వదు. దీంతో ఘాటీ మూవీ జనాల్లోకి వెళ్లే ఛాన్స్ తక్కువే.
తన సొంత నిర్మాణ సంస్థ కావటం, అనుష్క మంచి ఫ్రెండ్ కావటంతో ప్రభాస్ ఘాటీ ని ప్రమోట్ చేసేందుకు ఒప్పుకున్నాడట. ఎలాంటి బజ్ లేని ఘాటీ జనాల్లోకి వెళ్లాలంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ రంగంలోకి దిగాల్సిందే. కానీ ప్రజంట్ ప్రభాస్ కి ఉన్న బిజీ షెడ్యూల్ తో ఎలా ప్రమోట్ చేస్తాడో చూడాలి. రాజాసాబ్ మూవీ కూడా ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా వాయిదా పడిందని టాక్.