ప్రభాస్ అభిమానులు `రాధే శ్యామ్` గురించి ఎంతగా ఎదురు చూస్తున్నారో, ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని సినిమాల అప్‌డేట్ లు వచ్చినా, రిలీజ్ డేట్లు ఖరారైనా... `రాధే శ్యామ్` నుంచి ఎలాంటి అప్ డేటూ ఉండడం లేదు. కనీసం టీజర్ అయినా చూపించలేదు. సంక్రాంతికి టీజర్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ రాలేదు. కనీసం ఫిబ్రవరి 14న అయినా వస్తుందని అనుకున్నారు.
కానీ.. యూవీ క్రియేషన్స్‌పై ఎవ్వరికీ నమ్మకాల్లేకపోవడంతో... ఆరోజూ టీజర్ డౌటే అనిపించింది. కానీ యూవీ క్రియేషన్స్ షాక్ ఇచ్చింది. ప్రభాస్ టీజర్ ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రేమికుల రోజు సందర్భంగా 14న ప్రభాస్ `రాధేశ్యామ్` టీజర్ రావడం ఖాయమని తేలిపోయింది. ఇంకా టైమే ప్రకటించలేదు. మొత్తానికి ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులు ఫలిస్తున్నాయి. వాళ్లంతా 14 కోసం.. కళ్లప్పగించి.. ఎదురు చూడడమే మిగిలి వుంది. రాధే శ్యామ్ పాన్ ఇండియా సినిమా. కాబట్టి అన్ని భాషల్లోనూ ఒకేసారి టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది.