ప్రభాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టి. సిరీస్ నిర్మించే ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. దాంతో పాటు టైటిల్ పోస్టర్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది. తన ఇన్ స్ట్రా ద్వారా ఈసినిమా టైటిల్ ప్రకటించాడు ప్రభాస్. . అదే... `ఆది పురుష్`. `సెలబ్రెటింగ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్` అనేది ఉప శీర్షిక. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కిస్తున్నారు.
దాదాపు 400 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. బాలీవుడ్ నుంచి మరో ప్రముఖ కథానాయకుడు కూడా ఈ సినిమాలో నటిస్తాడని తెలుస్తుంది. రామాయణంలోని ముఖ్య ఘట్టాల ఆధారంగా సాగే చిత్రమిది. ప్రభాస్ రాముడిగా నటిస్తాడు. మిగిలిన పాత్రల్లో కూడా స్టార్లే కనిపించనున్నారు. కానీ.. సెంట్రాఫ్ అట్రాక్షన్ మాత్రం... ప్రభాసే. మిగిలిన నటీనటులు, తారాగణం.. త్వరలోనే చిత్రబృందం ప్రకటించనుంది.