ప్రభాస్ కాల్షీట్ల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న దర్శకులు, నిర్మాతలూ పడిగాపులు పడుతున్నారు. ప్రభాస్ మరో రెండు మూడేళ్ల వరకూ ఖాళీ అవ్వడని తెలిసినా సరే... క్యూలు తప్పడం లేదు. ప్రభాస్ `రాధే శ్యామ్` ఈ వేసవికివస్తుంది. ఆ తరవాత.. `సలార్` విడుదల అవుతుంది. సలార్.. సంక్రాంతికి అని టాక్. 2023లో ఆదిపురుష్‌ని చూడొచ్చు. అప్పుడే.. ప్రభాస్ 23వ సినిమా.. నాగ అశ్విన్ తో తెరకెక్కుతుంది.
ఈలోగా ప్రభాస్ 24, 25వ సినిమాలూ పక్కా అయిపోయినట్టు టాక్. ప్రభాస్ తన 24వ సినిమాకి సిద్దార్థ్ ఆనంద్ ని దర్శకుడిగా ఎంచుకున్నట్టు టాక్. బాలీవుడ్ లో వార్ సినిమాని రూపొందించింది సిద్దార్థ్ నే. `వార్` ముగిసిన వెంటనే.. `వార్ 2`ని హృతిక్, ప్రభాస్‌లతో తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. అప్పటి నుంచీ.. సిద్దార్థ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగ అశ్విన్ తో సినిమా పూర్తయిన తరవాత... సిద్దార్థ్ సినిమా పట్టాలెక్కుతుంది.
ఈలోగా... 25 వ సినిమా కూడా ఓకే అయిపోయినట్టు టాక్. 25వ సినిమా అంటే ఏ హీరోకైనా మైల్ స్టోన్ లాంటిది. ఈ సినిమాకి మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోందట. దర్శకుడిగా కొరటాల శివని ఎంచుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. మిర్చి సినిమాతో.. కొరటాల ప్రయాణం మొదలైంది. ఆసినిమా తరవాత.. బిజీ డైరెక్టర్ అయిపోయాడు. అయితే.. ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని కొరటాల ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ప్రభాస్ 25వ సినిమా ఆఫర్ కొరటాలకు దక్కితే అంతకంటే కావల్సిందేముంది?