డాన్సర్, నటుడు, దర్శకుడు... ప్రభుదేవా రెండో పెళ్లి వార్త ఇప్పుడు చిత్రసీమలో హాట్ టాపిక్. 47 ఏళ్ల ప్రభుదేవా రెండో పెళ్లి చేసేసుకున్నాడని, రెండు నెలల క్రితమే ప్రభుదేవా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడని చెప్పుకుంటున్నారు. ఓ డాక్టర్ తో కొంతకాలంగా ప్రభుదేవాకి పరిచయం ఉందని, ఆమెనే రెండో పెళ్లి చేసుకున్నాడని సమాచారం. అక్టోబరులోనే ముంబైలో వీరి పెళ్లి జరిగిందని, అయితే ఆ వివరాల్ని ప్రభుదేవా గోప్యంగా ఉంచాడని, కనీసం భార్య పేరు కూడా బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడని టాక్.
1995లో ప్రభుదేవాకు లతతో వివాహం అయ్యింది. వీళ్లకు ముగ్గురు పిల్లలు. ఆ తరవాత భార్యా భర్తల మధ్య విబేధాలు రావడంతో.. 2011లో విడిపోయారు. ఆ తరవాత కొంతకాలం నయనతారతో సన్నిహితంగా మెలిగాడు ప్రభుదేవా. ఒక దశలో నయన - ప్రభులు పెళ్లి చేసుకుంటారన్న వార్తలూ వినవచ్చాయి. అయితే.. ఆ తరవాత.. ఇద్దరూ దూరమయ్యారు. ఇంతకాలానికి మళ్లీ ప్రభుదేవా మనసు పెళ్లిపైకి మళ్లింది. దాంతో.. గుట్టు చప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.