'కంచె' సినిమాలో జమీందార్ యువతి సీత పాత్రలో కనిపించి మెప్పించిన ప్రగ్యాజైశ్వాల్ తొలి సినిమాకే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. సినిమా మంచి విజయం అందుకుంది. క్లాసిక్ ఫేస్ కావడంతో, ఆమె ముఖంలోని అనేక రకాల భావోద్వేగాలు చక్కగా పలికాయి ఆ సినిమాలో. క్యూట్‌నెస్‌తో పాటు, హుందాతనాన్ని ప్రదర్శించింది ఆ సినిమాలో. ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ సీత కంచెలు దాటేసింది. తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చింది. ఒక్కో యాంగిల్‌లో ఒక్కో రకమైన గ్లామర్‌ని ధారాళంగా ఆరేసేసింది. అవకాశాలు అరుదుగానే వచ్చినా, ఆ వచ్చిన ప్రతీ అవకాశాన్ని తనవంతు గ్లామర్‌తో, అక్కడక్కడా రెచ్చిపోయి చేసిన ఎక్స్‌పోజింగ్‌తో బాగానే సద్వినియోగం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ అమ్మడి గ్లామర్ దాడి ఆగలేదు. చూస్తున్నారుగా ఈ పిక్‌లో ప్రగ్యా జైశ్వాల్ ఆదమరచి ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఫోటోకి పోజిచ్చింది. ఆ ఆదమరపు ఎందుకొరకు అంటే, తనలోని హాట్ అప్పీల్ కొరకు అని భావించాలి మరి.