'కంచె' సినిమాతో తెరంగేట్రం చేసిన అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. తొలి సినిమాలో 'సీత' క్యారెక్టర్‌లో జమీందారీ అమ్మాయిగా ట్రెడిషనల్ లుక్‌లో ఆమె పాత్ర అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత మెల్ల మెల్లగా గ్లామర్ కంచెలు తెంచేసి తనలోని గ్లామర్ యాంగిల్స్‌ని ఒక్కొక్కటిగా బయట పెడుతూ వచ్చింది.
ఇటీవల 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. తొలి సినిమా తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేదు ప్రగ్యా జైశ్వాల్. క్లాసిక్ లుక్‌తోనే కాకుండా, యాక్షన్ గాళ్‌గానూ సత్తా చాటింది 'నక్షత్రం' సినిమాతో. మంచి హైటు, పర్సనాలిటీ ఉన్న ఈ ముద్దుగుమ్మ అందాన్ని సరిగ్గా వాడుకోవడం లేదంటూ విమర్శలు కూడా ఉన్నాయి. సరైన క్యారెక్టర్ పడితే, పర్‌ఫామెన్స్ పరంగా నూటికి నూరు మార్కులు వేయించుకోగల సత్తా ఉన్న బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్.
సినిమాలు అరకొరగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో తన అంద చందాలను ప్రదర్శనకు పెడుతూ, అభిమానులకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంటుంది. అందులో భాగంగానే తాజా పిక్‌లో స్కై బ్లూ కలర్ డ్రస్సులో దివి నుండి భువికి దిగిన అందాల రాజహంసలా హొయలొలికిస్తోందిలా.!