'అనగనగా ఒక ధీరుడు' సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు దర్శకేంద్రుని తనయుడు ప్రకాష్ కోవెలమూడి. తొలి సినిమాతో ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినా, ఆ చిత్రం రొటీన్ చిత్రాలకు భిన్నంగా తెరకెక్కింది. ఆ రకంగా ప్రశంసలు అందుకుంది. తెలుగులో ముద్దుగుమ్మ శృతిహాసన్‌కి ఇదే ఫస్ట్ సినిమా కాగా, మోహన్‌బాబు తనయ మంచు లక్ష్మీ నెగిటివ్ రోల్‌లో నటించి, అదరగొట్టేసింది. విజువల్‌గా ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడు ప్రకాష్ కోవెలమూడి. కాగా ఆ తర్వాత స్టార్ హీరోయిన్ అయిన అనుష్కతో 'సైజ్ జీరో' అంటూ మరో కొత్త ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగం కూడా నిరాశపరిచినా, ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. ఇలాంటి సినిమాల్ని అటెంప్ట్ చేయడమే చాలా గొప్ప విషయం. రొటీన్ చిత్రాలకి భిన్నంగా చిత్రాలు తెరకెక్కించాలన్నదే ప్రకాష్ టార్గెట్. అందుకే మరో ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఈ సారి యంగ్ హీరో శర్వానంద్‌తో ఓ ప్రయోగాత్మక చిత్రం రూపొందించబోతున్నాడట ప్రకాష్ కోవెలమూడి. శర్వానంద్ ప్రస్తుతం ఎంటర్‌టైనింగ్ సినిమాలతో రేసులో స్పీడుగా దూసుకెళ్లిపోతున్నాడు. ఇదే ఉత్సాహంతో కొంచెం డిఫరెంట్‌గా కూడా ట్రై చేయాలనుకుంటున్నాడట . అందుకే ప్రకాష్ కోవెలమూడితో చేతులు కలిపాడు. ఈ కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈలోగా శర్వానంద్ 'రాధ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.