నటుడు ప్రకాశ్‌రాజ్ కు రాజ్యసభ అవకాశం దక్కనుందా ? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రకాష్ రాజ్ ని జాతీయ రాజకీయాల్లో కీలక భాద్యత అప్పగిస్తారా ? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. సినిమానే కాదు రాజకీయాలపై కూడా ప్రకాష్ రాజ్ కి ఆసక్తి ఎక్కువ. బీజేపీ వ్యతిరేక భావజాలంతో దేశవ్యాప్తంగా ప్రకాశ్‌రాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేసీఆర్, ప్రకాష్ రాజ్ మధ్య భావజాలంలో సారూప్యత వుంది. ఫెడరల్ ఫ్రంట్ చర్చలు జరిపినప్పుడు దేవెగౌడతో కలిసే సందర్భంలోనూ కేసీఆర్ కి -దేవెగౌడకి మధ్య ప్రకాష్‌రాజ్ ఉన్నారనే మాట కూడా అప్పట్లో వినిపించింది. ఇటివల కేసీఆర్ ముంబైకి వెళ్తూ ప్రకాష్‌రాజ్‌ను పిలిపించారనే ప్రచారం జరుగుతోది.
త్వరలో తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఒక స్థానంలో ప్రకాశ్ రాజ్ కు అవకాశం కల్పిస్తే ..జాతీయ స్థాయిలో బిజెపి వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం ఉంటుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బండ ప్రకాశ్ రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీగా ఉండగా.. జూన్‌లో మరో ఇద్దరు డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలు టీఆర్ఎస్‌కే దక్కనున్నాయి. ఇందులో ఒక స్థానాన్ని ప్రకాశ్‌రాజ్‌కు ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.