త‌ప్పుగా అర్థం చేసుకోవ‌ద్దు ప్లీజ్..!

మరిన్ని వార్తలు

జాతీయ అవార్డు పొందిన 'అ!' చిత్ర‌ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న మూడో సినిమా రూప‌క‌ల్ప‌న‌లో బిజీగా ఉన్నారు. తొలి రెండు చిత్రాలు 'అ!', 'క‌ల్కి'ల‌తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా ఇటు ప్రేక్ష‌కుల‌, అటు విమ‌ర్శ‌కుల మెప్పు పొందిన ఆయ‌న ఇప్పుడు నిజ జీవిత ఘ‌ట‌న‌లను ఆధారం చేసుకొని సినిమా తీస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి 'జాంబీ రెడ్డి' అనే విభిన్న త‌ర‌హా టైటిల్ ప్ర‌క‌టించారు. హాలీవుడ్‌లో త‌యారైన వెన్ను జ‌ల‌ద‌రింప‌జేసే యానిమేష‌న్‌తో త‌న‌దైన స్టైల్‌తో ప్ర‌శాంత్‌వ‌ర్మ ఆ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. తెలుగులో ఇది మొట్ట‌మొద‌టి జాంబీ ఫిల్మ్ కావ‌డం విశేషం. టైటిల్‌కు, యానిమేష‌న్‌కు ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. అయితే కొంత‌మంది 'జాంబీ రెడ్డి' టైటిల్‌ను ఒక క‌మ్యూనిటీకి ఆపాదించి, త‌ప్పుగా అర్థం చేసుకుంటున్న‌ట్లు టీమ్ దృష్టికి వ‌చ్చింది. దీనిపై డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ వివ‌ర‌ణ ఇచ్చారు.

"ఇటీవ‌ల మా సినిమా టైటిల్ 'జాంబీ రెడ్డి' అని ప్ర‌క‌టించాం. దానికి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్విట్ట‌ర్‌లో జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అయ్యింది. టైటిల్ చాలా బాగుందంటూ చాలా కాల్స్‌, మెసేజ్‌స్ వ‌చ్చాయి. మీమ్స్ కూడా వ‌చ్చాయి. సినిమాకు అది యాప్ట్ టైటిల్‌. యానిమేష‌న్ చాలా బాగుందంటున్నారు. దానిపై మూడు నెల‌ల‌కు పైగానే వ‌ర్క్ చేశాం. టీమ్ ప‌డిన క‌ష్టానికి వ‌చ్చిన రిజ‌ల్ట్‌తో మేమంతా హ్యాపీగా ఉన్నాం. కొంత‌మంది మాత్రం టైటిల్‌ను త‌ప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమాలో ఎవ‌రినీ త‌క్కువ చేసి చూపించ‌డం, ప్ర‌త్యేకించి ఒక క‌మ్యూనిటీని త‌క్కువ చేసి చూపించ‌డం ఉండ‌దు. ఇదొక ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫిల్మ్‌. ప్ర‌స్తుతం మ‌నం చూస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి చుట్టూ జరిగే, క‌ర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌. హాలీవుడ్‌లో ఈ ర‌కం ఎపిడెమిక్ ఫిలిమ్స్ చూస్తుంటాం. అక్క‌డ న్యూయార్క్ లాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఆ క‌థ జ‌రిగిన‌ట్లు చూపిస్తుంటారు. నేను క‌ర్నూలును బ్యాక్‌డ్రాప్‌గా ఎంచుకున్నాను. క‌ర్నూలులో ఇలాంటి మ‌హ‌మ్మారి త‌లెత్తితే, అక్క‌డి ప్ర‌జ‌లు ఎలా ఫైట్ చేసి, ఈ మ‌హ‌మ్మారిని నిరోధించి, ప్ర‌పంచాన్నంతా కాపాడ‌తార‌న్న‌ది ఇందులోని ప్ర‌ధానాంశం. క‌ర్నూలును క‌థ ఎంత హైలైట్ చేస్తుందో సినిమా చూస్తే తెలుస్తుంది. ద‌య‌చేసి టైటిల్‌ను త‌ప్పుగా ఊహించుకోవ‌ద్దు. ఏ కులాన్నీ త‌క్కువ‌చేసి చూపించ‌డం అనేది క‌చ్చితంగా ఈ సినిమాలో ఉండ‌దు. నా ఫ‌స్ట్ ఫిల్మ్ 'అ!'కు జాతీయ స్థాయి గుర్తింపు వ‌స్తే, ఈ సినిమాకు అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను. అంద‌రూ గ‌ర్వంగా ఫీల‌వుతారు." అని ఆయ‌న వివ‌రించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS