ప్రతిరోజు పండగే సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ లో సాయితేజ్ !!!

మరిన్ని వార్తలు

తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేరాడు. సాయి తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తోన్న `ప్రతీ రోజు పండ‌గే` ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ లో సాయి తేజ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్నాడు. సాయి తేజ్ హోమం చేస్తుండగా వచ్చే యాక్షన్ సీన్, ఆ సీన్‌లో హీరో షర్ట్ లేకుండా ఫైట్ సీక్వెన్స్ లో సిక్స్ ప్యాక్ లొ తేజ్ కనిపిస్తాడు. ఫిట్‌నెస్‌ ట్రైనర్ సాయంతో వర్కౌట్ క్లాసెస్‌ అటెండ్ అయ్యి ఈ లుక్ కు మారాడు.

 

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్‌ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీలో సాయి తేజ్ కు జోడిగా రాశిఖన్నా నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS