ప్రియా ప్రకాష్‌కి ఆ అవకాశాలే ఎక్కువట

By iQlikMovies - March 15, 2018 - 10:53 AM IST

మరిన్ని వార్తలు

ఒక్క వీడియోతో సెన్సేషనల్‌ అయిపోయిన భామ ప్రియా ప్రకాష్‌ వారియర్‌. సామాన్య జనం నుండి, స్టార్‌ సెలబ్రిటీస్‌ వరకూ ఈ ముద్దుగుమ్మ ఎట్రాక్ట్‌ చేసేసింది. 

'ఒరు అదర్‌ లవ్‌' అనే ఓ మలయాళ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆ సినిమా విడుదల కాకుండానే, ఆమె యాక్టింగ్‌ టాలెంట్‌ ఏంటి అనేది తెలియకుండానే, అనుకోకుండా విడుదల చేసిన ఓ వీడియో అమ్మడి దశ తిరిగేలా, దేశం మొత్తం మాట్లాడుకునేలా మారిపోయింది. అయితే ఈ సెన్సేషన్‌ చూసిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయనే ప్రచారం బాగా జరిగింది. కానీ ఈ బ్యూటీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా అవకాశాలు పోటెత్తుతున్నాయట. 

సినిమా అవకాశాల సంగతి పక్కన పెడితే, ఈ రకంగా అమ్మడికి వస్తున్న సంపాదన అపారంగా మారిందట. వాణిజ్య ప్రకటనలకు ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ బ్యూటీ అయిపోయిందిప్పుడు. ఇదే మంచి తరుణం అనుకుని ఈ బ్యూటీ భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తోందట. అయితే టాలీవుడ్‌ నుండి అవకాశాలు వస్తున్నాయన్న ప్రచారమే కానీ, ఇంతవరకూ ఏ సినిమాకీ ఆమె సైన్‌ చేసినట్లు క్లారిటీ లేదు. కానీ బ్రాండ్‌ ఆంబాసిడర్‌గా ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోందట ఈ ముద్దుగుమ్మ. 

అందుకే ఈ భామ పలానా కంపెనీ తరపున సోషల్‌ మీడియాలో జస్ట్‌ కొన్ని నిముషాలు కనిపించడానికే, లక్షల్లో రెమ్యునరేషన్‌ అడుగుతోందట. అయినా కానీ ఆమె అడిగిన రెమ్యునరేషన్‌ ఇచ్చి మరీ తమ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా సోషల్‌ మీడియాలో ప్రమోట్‌ చేయడానికి ఈ ముద్దుగుమ్మని ఎంచుకున్నారట సదరు సంస్థల నిర్వాహకులు. ఈ రకంగానూ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ సంచలనాలే నమోదు చేస్తోంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS