అనుకోకుండా సినిమా ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్‌గా ఓకే చేసింది. ఆ సినిమాలోని ఓ సాంగ్ ఆమెకు ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించి పెట్టింది. రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఓ మలయాళ బ్యూటీ తెలుగు, తమిళ, హిందీ ఇలా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఎవరి గురించి చెబుతున్నామో ఇప్పటికే అర్ధమైపోయుంటుంది.
మలయాళ కుట్టి ప్రియా వారియర్. అదేనండీ, ఈ మధ్య సోషల్ మీడియా వీడియో ద్వారా వైరల్ అయ్యింది కదా ఆ ముద్దుగుమ్మే. మలయాళంలో తెరకెక్కిన 'ఒరు ఆదర్ లవ్' అనే మలయాళ చిత్రం ద్వారా ఈ బ్యూటీ సినీ తెరంగేట్రం చేసింది. ఈ సినిమా టీజర్ సాంగ్ ప్రోమో ద్వారానే పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీకి వచ్చిన పాపులారిటీ, ఫాలోయింగ్‌తో అమ్మడికి వరుస పెట్టి ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. దక్షిణాది నుండే కాక బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు క్యూ కడుతున్నా, వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించేసిందట ప్రియా వారియర్.
అందుకు కారణం ఆమె తన స్టడీస్ పూర్తి చేశాకే యాక్టింగ్‌పై దృష్టి పెట్టాలనుకుంటోందట. అనుకోకుండా కమిట్ అయిన 'ఒరు అదర్ లవ్' చిత్రం విడుదలయ్యాక, స్టడీస్ కంప్లీట్ అయ్యాకే, ఏ భాషలోనైనా కొత్త చిత్రంపై సైన్ చేస్తానని నిర్మొహమాటంగా చెబుతోంది ఈ బ్యూటీ. సినిమా ఛాన్సులు వదుకుంటోంది కానీ, వాణిజ్య ప్రకటనల్లో మాత్రం జోరు ప్రదర్శిస్తోందీ ముద్దుగుమ్మ. అమ్మడికి ఉన్న పాపులారటితో వాణిజ్య ప్రకటనలకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది. కానీ ప్రస్తుతం సినిమాలకే నో చెప్పేస్తోంది ప్రియా వారియర్.