నిన్న పెళ్లన్నారు నేడు తల్లంటున్నారు

మరిన్ని వార్తలు

హాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత ప్రియాంకా చోప్రా చాలా మారిపోయింది. ఎక్స్‌పోజింగ్‌ ప్రియాంకా చోప్రాకి కొత్తేమీ కాదు. కానీ ఆ ఎక్స్‌పోజింగ్‌లోనే కొత్త కోణాలను ఆవిష్కరిస్తోందిప్పుడు. నిన్న చేతికి బ్రాస్‌లైట్‌ లాంటి యాక్సెసరీ ఏదో పెట్టుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫోటో చూసి, ప్రియాంకాకి పెళ్లయిపోయింది. తన చేతికి ఉన్నవి నల్లపూసలు అన్నారు. 

అయితే ఆ గాసిప్స్‌కి స్పందించిన ప్రియాంకా చోప్రా పెళ్లయితే చెబుతాను కదా. అవి నల్లపూసలు కావు. జస్ట్‌ బ్రాస్‌లైట్‌ అంతే అంది. అయితే తాజాగా ప్రియాంకా వేసుకున్న కాస్ట్యూమ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఆ కాస్ట్యూమ్‌లో ప్రియాంకాని చూసిన నెటిజన్లు ప్రియాంకా తల్లయ్యిందే అంటున్నారు. బ్రెస్ట్‌ ఫీడింగ్‌ కోసమే అలాంటి కాస్ట్యూమ్‌ వేసుకుందని దారుణంగా కామెంట్స్‌ వేస్తున్నారు. అవును నిజమే ఆమె వేసుకున్న డ్రస్సు అలాగే ఉంది మరి. 

గ్లామర్‌ పేరుతో మరీ ఇంత డిఫరెంట్‌గా కాస్ట్యూమ్‌ డిజైన్‌ చేయించుకుంటే, అలాగే అంటారు మరి. బ్రెస్ట్‌ పైన రెండు వైపులా ఓపెన్‌గా ఉన్న ఈ కాస్ట్యూమ్‌ చూస్తే ఎవరైనా ఇది స్టైల్‌ అనుకోరేమో. అందుకే ఇలాంటి కామెంట్స్‌ వస్తున్నాయి ప్రియాంకాపై. ప్రస్తుతం హాలీవుడ్‌లో ప్రియాంకా నటిస్తోన్న 'క్వాంటికో' వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ప్రియాంకా చోప్రా. 

ఓ వైపు హాలీవుడ్‌తో పాటు, బాలీవుడ్‌ సినిమాలతోనూ ఫుల్‌ బిజీగా గడిపేస్తోంది హాట్‌ హాట్‌ ప్రియాంకా చోప్రా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS