నేచురల్ స్టార్ నాని - కన్నడ భామ శ్రద్ధాదాస్ జంటగా తెరకెక్కిన చిత్రం 'జెర్సీ'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లు ఇద్దరూ ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ ఈ ఇద్దరూ యాక్టివ్‌గా కనిపించారు.
పదేళ్లుగా నాని యాక్టింగ్లోని డిఫరెంట్ వేరియేషన్స్‌ని చూసేశాం. నాని యాక్టింగ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక హీరోయిన్ శ్రద్ధాదాస్ విషయానికి వస్తే, ఈ సినిమా ఆమెకి తెలుగులో తొలి సినిమా. కన్నడలో 'యూటర్న్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. కార్తి హీరోగా తెరకెక్కిన 'చెలియా'లో ఓ చిన్న రోల్ పోషించింది. అయితే 'జెర్సీ' విషయానికి వస్తే చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తోందీ భామ. సినిమాలో కూడా నానితో పోటీ పడి నటించిందట. అనుభవంలో నానితో పోల్చితే చాలా తక్కువ. కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా టాలెంట్ ప్రదర్శించిందట. హీరోయిన్ పాత్రంటే కేవలం గ్లామర్ కోసమే అన్నట్లుగా కాకుండా, ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్ పాత్రకు చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారట. ఈ సినిమాతో ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ అందరూ తనను గుర్తు పెట్టుకుంటారనీ నమ్మకం వ్యక్తం చేస్తోంది. సినిమాలో గ్లామర్‌కి అంతగా స్కోపు లేకున్నా, అమ్మడిలో గ్లామర్ యాంగిల్స్కేమీ లోటు లేదు.
అవసరమైతే అవకాశమొస్తే, గ్లామర్‌కీ సై సై అంటోంది. ఇకపోతే ఈ సినిమా కన్నా ముందే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమాకి సైన్ చేసిందీ కన్నడ కుట్టీ. అలాగే యంగ్ హీరో ఆది సాయికుమార్తోనూ ఓ సినిమాలో నటిస్తోంది అందాల శ్రద్దా శ్రీనాధ్.