పవన్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ సర్‌ప్రైజ్‌!

మరిన్ని వార్తలు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ‘పింక్‌’ రీమేక్‌ (వకీల్‌ సాబ్‌ వర్కింగ్‌ టైటిల్‌)తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మార్చి 2న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అదే వారంలో అంటే, మార్చి 8న తొలి సింగిల్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తాజా సమాచారం. మహిళలపై జరిగే అకృత్యాలను బేస్‌ చేసుకుని రూపొందుతున్న చిత్రమిది. సో మహిళా దినోత్సవం రోజు ఈ సినిమా నుండి ఫ్యాన్స్‌ పండగ చేసుకునేలా ట్రీట్‌ ఇవ్వనున్నారట. 21 రోజులు మాత్రమే డేట్స్‌ కేటాయించిన ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ లుక్స్‌ ఎలా ఉండబోతున్నాయో అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

ఇప్పటికైతే, లీకేజీ ఫోటోనో, ఆన్‌ సెట్స్‌ ఫోటోనో తెలీదు కానీ, రోడ్డుపై పాన్‌ షాప్‌ ఎదురుగా పవన్‌ నడుచుకుని వెళ్తున్న ఫోటో ఒకటి ఈ సినిమాకి సంబంధించి వైరల్‌ అవుతోంది. ఫోటోలో క్లారిటీ లేకున్నా, ఈ ఫోటో పవన్‌ ఫ్యాన్స్‌కి ప్రొఫైల్‌ పిక్‌గా మారిపోయింది. ఇక అసలు సిసలు ఫస్ట్‌లుక్‌ వస్తే ఆ వైబ్స్‌ ఎలా ఉంటాయో ఊహించడమే కష్టం. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ నీట్‌ షేవ్‌లో డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌తో కనిపిస్తున్నారు. ఈ లుక్స్‌ పవన్‌ తదుపరి చిత్రంలోనిది అని మాట్లాడుకుంటున్నారు. పీరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS