ఈ రోజు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్‌కి గిఫ్టుల మీద గిఫ్టులు అందుతున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు `వకీల్ సాబ్ `మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇప్పుడు క్రిష్ సినిమాకి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ ఇస్తామని చిత్రబృందం ముందే చెప్పింది. చెప్పినట్టే ఈరోజు పవన్ ప్రీ లుక్ విడుదల చేసింది.
పవన్ గెటప్ ని పూర్తిగా రివీల్ చేయలేదు గానీ... చేతికి ఉంగరాలు, కడియం, నడుమున చుట్టుకున్న వస్త్రం, అందులో బంగారు రంగులో మెరుస్తున్న గద్ద... ఇలా పవన్ లుక్ ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేశాడు క్రిష్. ``15 రోజుల షూటింగ్ టీమ్ అంతటికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతోంది. చిరస్థాయిలా మిగిలిపోయే విజయం కంటికి కనిపిస్తోంది`` అంటూ క్రిష్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో పవన్ ఓ గజ దొంగలా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు గెటప్ కూడా అలానే కనిపిస్తోంది.