లాక్ డౌన్ వల్ల పవన్ కల్యాణ్ ప్రణాళికలన్నీ అస్తవ్యస్థమైపోయాయి. 2022లోపు చక చక సినిమాలు చేసేసి, మళ్లీ రాజకీయాల్లో బిజీ అవ్వాలని భావించాడు పవన్. కానీ.. షూటింగులు ఆగిపోవడం వల్ల తాను అనుకున్నంత వేగంగా సినిమాలు చేయలేకపోతున్నాడు. పవన్ ముందున్న పెద్ద టార్గెట్. వకీల్ సాబ్ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయడం. ఆ తరవాత క్రిష్ సినిమా లైన్ లో ఉంది. ఇవి రెండూ పూర్తయ్యాకే హరీష్ శంకర్ సినిమా పని మొదలెట్టాలి.
కానీ పవన్ కల్యాణ్ ఆలోచనలు మారాయి. వకీల్ సాబ్ అవ్వగానే, హరీష్ శంకర్‌ని లైన్‌లోకి దింపాలని పవన్ భావిస్తున్నాడు. దానికి రెండు కారణాలున్నాయి. వకీల్ సాబ్ పక్కా క్లాస్ సినిమా. కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది. హీరోయిజానికీ, పవన్ స్టైల్ చూపించుకోవడానికీ స్కోప్ ఉండదు. క్రిష్ సినిమా కూడా అంతే. అందుకే వీటి మధ్య మంచి మాస్ సినిమా చేయాలనుకుంటున్నాడు పవన్. అలాంటి సినిమాల్ని ఇవ్వడంలో హరీష్ శంకర్ దిట్ట. అందుకే...క్రిష్ సినిమా కంటే ముందు హరీష్ తో సినిమా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇక అన్నింటికంటే ముఖ్యంగా క్రిష్‌సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టు. అది పూర్తవ్వడానికి టైమ్ పడుతుంది. అందుకే.. పవన్ ఈ నిర్ణయానికి వచ్చాడని సమాచారం.