కాల్విన్‌ క్లెయిన్‌: దిశాని కొట్టేద్దామనే.!

మరిన్ని వార్తలు

ఇన్నర్‌ వేర్‌ బ్రాండ్‌ కాల్విన్‌ క్లెయిన్‌ పేరు చెబితే గుర్తొచ్చేది హాట్‌ బ్యూటీ దిశా పటానీనే. మత్తెక్కించే ఫిగర్‌తో ఎన్ని సార్లు చూసినా బోర్‌ కొట్టని అందంతో కేక పుట్టించే ఈ ముద్దుగుమ్మని తలదన్నేలా హాట్‌ పోజులిచ్చేసింది మరో ముద్దుగుమ్మ. సారీ బొద్దుగుమ్మ. ఇంతకీ ఎవరీ బొద్దుగుమ్మ అనుకుంటున్నారా.? బిగ్‌బాస్‌ క్రేజీ బ్యూటీ.. పునర్నవి భూపాళం. ఇంతకీ ఏం చేసిందీ పునర్నవి మేడమ్‌ అంటే, కాల్విన్‌ క్లెయిన్‌ ఇన్నర్‌ వేర్‌ ధరించి హాట్‌గా కాదు కాదు ఘాటుగా ఫోటోలకి పోజిచ్చేసింది.

 

ఈ ఘాటు ఫోటో షూట్‌కి పాపం కుర్రకారు పాపం చుక్క లేకుండానే చక్కర్లు కొట్టేస్తున్నారు. ఆ మధ్య బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 రన్నింగ్‌లో ఉన్నప్పుడు పునర్నవి భూపాళం పేరు వార్తల్లో తెగ మార్మోగిపోయింది. ఆ సీజన్‌ అయిపోయాక కూడా కొన్నాళ్లు పునర్నవిని బాగానే పట్టించుకున్నారు. హీరోయిన్‌గా చాలా సినిమాల్లో అవకాశాలు కూడా దక్కాయంటూ మాట్లాడుకున్నారు. అంతేనా, అదే సందు, ఇదే సందు అంటూ, పునర్నవి నటించిన 'సైకిల్‌' అనే మూవీకి అదే టైమ్‌లో బిజినెస్‌ కూడా చేసుకున్నారు.

 

అప్పటికే హీరోయిన్‌గా రెండు సినిమాలు కూడా పూర్తి చేసేసిన పునర్నవి ప్రస్తుతం మరికొన్ని కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా, వాటి స్టేటస్‌ ఏంటనే అంశంపై క్లారిటీ లేదు ప్రస్తుతం. అలా వదిలేస్తే అంతా మర్చిపోతారనుకుందో ఏమో, ఇదిగో ఇలా హాట్‌ అవతారమెత్తి నెట్టింట్లో విశ్వరూప దర్శనాలిచ్చింది. ఇంకేముంది ఈ హాట్‌ అండ్‌ సెక్సీ భూపాళ దర్శనాలకు యూత్‌ అంతా మళ్లీ రీ ఛార్జ్‌ అయిపోయారు మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS